ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శ్రమయా ! శ్రమ ఎలా ఒక ప్రత్యేక అవకాశము ? ఇది యేసు కోసం అయితే తప్ప అది మంచి అవకాశము కాదు. మొదటి అపొస్తలులు ఆ పేరును బట్టి బాధపడటానికి అర్హులుగా పరిగణించబడినందున వారు ఎలా ఆనందించారో గుర్తుందా? ( అపొస్తలుల కార్యములు 5:41ను పోల్చి చుడండి ) మనం రక్షింపబడేలా ఆయన మన కోసం బాధలు పడ్డాడు. క్రీస్తు మరియు ఆయన రాజ్యం కోసం మనం బాధలను ఎదుర్కొన్నప్పుడు, కష్టాల్లో నమ్మకంగా జీవించడానికి మరియు మన విశ్వాసం యొక్క వాస్తవికతను చూపించడానికి ఇతరులను ప్రేరేపించడానికి మనం సహాయం చేసినవారము అవుతాము . కాబట్టి కొద్దిమంది మాత్రమే తమ జీవించడానికి, చనిపోవడానికి లేదా బాధలకు తగినది ఏదైనా కలిగి ఉంటారు. ఈ మూడింటికి మనకు కారణం ఉంది: మన జీవితాలు యేసు విజయంలో చిక్కబడినాయి ! (. రోమా. 8:32-39; 1 కొరిం. 15 కూడా చూడండి )

నా ప్రార్థన

నాకు ధైర్యాన్ని కలిగించు, ఓ దేవా! కష్ట సమయాల్లో నమ్మకంగా ఉండేందుకు మరియు హింస, కష్టాలు మరియు బాధల సమయాల్లో బలంగా ఉండటానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు