ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు దేవుని ముఖాన్ని చూపించి మన శత్రువుల నుండి మనలను రక్షించడానికి వచ్చాడు. కానీ నేడు, ప్రపంచంలోని క్లిష్ట ప్రాంతాలలో మరియు చాలా మంది ప్రజలు చాల తక్కువగా హింసను ఆశించే ప్రదేశాలలో కూడా క్రైస్తవులు దాడికి గురవుతున్నారు. పాపం మరియు దాని శక్తి నుండి అంతిమంగా మరియు పూర్తిగా మనలను రక్షించడానికి దేవుడు యేసును పంపాడు. దౌర్జన్యం, పేదరికం, హింస, దుర్వినియోగం మరియు ఎగతాళిల బారి నుండి తన పిల్లలను విడిపించడానికి మన శక్తివంతమైన దేవుడు ఈ రోజు మన ప్రపంచంలో శక్తివంతంగా పని చేస్తాడని ప్రార్థిద్దాం. అలా చేసినందుకు దేవుణ్ణి స్తుతించాలని ప్రార్థిద్దాం!

నా ప్రార్థన

పవిత్రమైన మరియు నీతిమంతుడవైన తండ్రీ, దయచేసి మీ ప్రియమైన పిల్లలందరినీ శక్తివంతంచేయండి. మీ శక్తివంతమైన బలమును ప్రదర్శించేటప్పుడు మీ విమోచనను మాకు తెలుపండి మరియు చూపించండి. మీరు మా విమోచకుడు మరియు రక్షకుడు. మీ కుమారుడైన యేసు పేరిట ప్రార్థిస్తున్నాం. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు