ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సువార్త వ్యాప్తికి సహాయపడటానికి మరియు ప్రతీరోజు రక్షించబడినవారి సంఖ్యను పెంచుటలో సహాయపడటానికి మీరు ఏమి చేయగలరు? చాలా విషయాలు ఉన్నాయి: యేసును గూర్చి ఒక మంచి మాట మాట్లాడటం , ఒక స్నేహితుడితో మీ విశ్వాసమును పంచుకోవటం , ఒక సువార్త పరిచర్య యాత్రకు వెళ్ళటం, ఒక మిషనరీకి ఆర్థిక సహాయమును పంపడం ,మరియు అనేక ఇతరు కార్యక్రమాలు చేయటం . కానీ మీరు చేయగలిగిన అతి ముఖ్యమైన వాటిలో ఒకటి ప్రార్థించటం! మిషనరీలు మరియు బోధకుల కోసం, ఇంటర్నెట్, రేడియో, టెలివిజన్ ముద్రణ ద్వారా దేవుని వాక్యాన్ని మరియు యేసు యొక్క దయను పంచుకునే మరియు పరిచర్య చేసే వారికొరకు ప్రార్థించండి. సువార్తను వేగంగా వ్యాప్తి చేయడానికి ప్రార్థన చేసి, అది దాని శక్తి మరియు ప్రభావంలో పెరగడం కోసం ప్రార్థించండి.

నా ప్రార్థన

ప్రియమైన కాపరి, తప్పిపోయినవారిని గూర్చి మీరు వేదన చెందుతున్నారని నాకు తెలుసు. సువార్త సత్యాన్ని ధైర్యంగా మాట్లాడటానికి ప్రపంచవ్యాప్తంగా సువార్తికులను మీరు బలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. వినువారి హృదయాలను తాకునట్లు ఆవిధముగా వారు మీ రక్షణను అనుభవపూర్వకముగా ఎరుగునట్లు ప్రార్థిస్తాను .మీ రక్షణ యొక్క వ్యాప్తిలో భాగంగా, మీకు ఇష్టమైన విధముగా నన్ను ఉపయోగించుకొనండి .యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు