ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ విషయంలో మీరు బహుశా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. మీరు ఎలా వున్నారు అని ఎవరైనా అడుగుతారు. మొదట, వారు ఆసక్తి కనబరుస్తారు, కానీ మీరు మీ హృదయ భారాన్ని పంచుకోవడం ప్రారంభించినప్పుడు, వారు నిజంగా వినడం లేదని మరియు నిజంగా ఆసక్తి చూపడం లేదని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు; ఇలా అడుగుట ద్వారా వారు మర్యాదగా మాత్రమే ఉన్నారు. చాలా మందికి చాలా భారాలు ఉన్నాయి, ఎక్కువగా ఏమి చేయాలో వారికి తెలియదు. అయితే, పరలోకంలో ఉన్న మా తండ్రి " మీ చింత యావత్తు నా మీద వేయుడి ". నేను మీతో నిజాయితీగా శ్రద్ధ వహిస్తున్నందున మీరు వాటన్నింటినీ నాతో పంచుకోవచ్చు."అని చెప్పుచున్నాడు.

నా ప్రార్థన

తండ్రీ, నేను చాలా విధాలుగా ఆశీర్వదించబడ్డాను. మీకు చాలా కృతజ్ఞతలు. నాకు కొన్ని నిజంగా భారమైన విషయాలు ఉన్నాయి, అయితే,అవి నాకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఏది ఉత్తమమైనదో మరియు మీకు అత్యంత మహిమను తెచ్చేవి ఏవో వాటిగురించి ఆలోచించండి. (దయచేసి మీ భారాలను మరియు ఆందోళనలను ప్రభువుతో పంచుకోండి.) నా మాటలు మరియు నా హృదయాన్ని విన్నందుకు ధన్యవాదాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు