ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

బైబిల్ యొక్క ప్రారంభ అధ్యాయాలలో అనేక గొప్ప సత్యాలు మనకు బోధించబడ్డాయి. మొదట, మనము స్త్రీ, పురుషులముగా దేవుని స్వరూపంలో చేయబడ్డాము. రెండవది, మనం భిన్నంగా (మగ మరియు ఆడ) తయారుచేయబడ్డాము. మూడవది, మనం ఒకరినొకరు ఆశీర్వదించడానికి మరియు ఒకరినొకరు అభినందించుకొనడానికి తయారు చేయబడ్డాము. నాల్గవది, భార్యాభర్తలు తమ కుటుంబాలను విడిచిపెట్టి, వారి జీవితాలను కలిసి నిర్మించుకున్నారు (ఆది 1: 26-2: 25). జీవితానికి జీవిత భాగస్వామిని కనుగొనడం అంటే దేవుడు తన స్వరూపంలో సృష్టించినది, నిజంగా మంచిది మరియు దేవుడు నిజంగా కోరుకునేదాన్ని కనుగొనడమే.

నా ప్రార్థన

తండ్రీ, నా జీవితం కోసం మీ ప్రణాళికకు ధన్యవాదాలు. (వివాహితుల కోసం) నా జీవిత భాగస్వామికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఆ వ్యక్తిని అన్ని విధాలుగా ఆశీర్వదించడంలో మరియు నెరవేర్చడంలో మీ సహాయం అడుగుతున్నాను. (వితంతువుల కోసం) ప్రియమైన తండ్రీ, నా నష్టం మరియు దుః ఖాన్ని మీరు ఓదార్చాలని మరియు మీరు ఈ ప్రత్యేక వ్యక్తి ద్వారా నా నా జీవితాన్ని ఆశీర్వదించిన మీకు నా కృతజ్ఞతలని మీకు తెలుసును.(ఒంటరివారి కోసము ) నా జీవిత మార్గాన్ని తెలుసుకోవడానికి మరియు నేను చిత్తశుద్ధితో మరియు విశ్వాసంతో జీవించే విధంగా ఇతరులను ఆశీర్వదించడానికి నన్ను ఉపయోగించమని మీరు నాకు సహాయం చేయమని నేను కోరుతున్నాను. (విడాకులు తీసుకున్నవారికి) ప్రియమైన తండ్రీ, మీరు నా నష్టాలలో నాకు సహాయము చేయమని మరియు మీకు సేవ చేయడానికి మరియు మీకు మహిమను తెచ్చేందుకు నన్ను ఉపయోగించమని నేను అడుగుతున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు