ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సమస్త అయోమయాలను తొలగించినప్పుడు, మీ నిజమైన ఆశ ఏమిటి? మీరు డిప్లొమాలు, అవార్డులు, ప్రశంసలు మరియు గౌరవాలను పక్కన పెట్టినప్పుడు, మీ ప్రాముఖ్యతకు ఆధారం ఏమిటి? నిరీక్షణకు ఒక మూలం మరియు ప్రాముఖ్యత యొక్క ఒక ఆధారం నమ్మదగినదినవాడు మాత్రమే.ఒక్కడే - అదే యెహోవా దేవుడు - శాశ్వతంగా ఉంటాడు! పరలోకంలో ఉన్న మన తండ్రి మాత్రమే మన జీవితం ప్రాముఖ్యమైనదని హామీ ఇస్తాడు. కాబట్టి మన ఆశను యెహోవా మీద ఉంచి ఆయనను మనకు ఆశ్రయం చేద్దాం!

నా ప్రార్థన

యెహోవా, దేవా మరియు మా తండ్రుల విమోచకుడా , మీ అనేక వాగ్దానాలను నెరవేర్చువాడా , నా నిరీక్షణ, నా భవిష్యత్తు మరియు నా ప్రాముఖ్యతను మీ చేతుల్లో ఉంచడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు. మీరు నన్ను సిగ్గుపడనివ్వరు, కానీ ఆ రోజున నేను నీ సమక్షంలో నిలబడి మీ నీతిని నాతో పంచుకుంటానని తెలుసుకోవటానికి నాకు ధైర్యం మరియు విశ్వాసం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు