ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం రోజువారీ యుద్ధం వంటిది , మనలను క్రీస్తులా వుండునట్లుగా చేయుటకు మన శరీరము మరియు దేవుని ఆత్మ మధ్య కొనసాగుతున్న యుద్ధం. ఆత్మ యొక్క శక్తి లేకుండా, మన సంకల్ప శక్తి చివరికి విఫలమవుతుంది. కానీ మనలో పనిచేసే ఆత్మ యొక్క శక్తి కారణంగా, శరీరములో మన వైఫల్యాలను అధిగమించవచ్చు మరియు మనము క్రీస్తులా ఉండుట అనే మన లక్ష్యము విషయము పురోగతిలో మనకు నమ్మకము కల్పించబడుతుంది (2 కొరింథీయులు 3: 17-18).

నా ప్రార్థన

తండ్రీ, నన్ను క్షమించు, మీ ఆత్మ యొక్క పిలుపుపై నా శరీరాన్ని గెలవడానికి ఇష్టపూర్వకముగా నేను అనుమతించాను. ఆత్మ యొక్క పవిత్ర అగ్నితో నన్ను శుభ్రపరిచినందుకు మరియు నా రక్షకుడిలా ఉండటానికి నన్ను ముందుకు ఆకర్షించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు, నేను ఉద్దేశపూర్వకంగా నా హృదయాన్ని మీకు అందిస్తున్నాను, తద్వారా నేను యేసులాగా ఉండటానికి శక్తివంతం అవుతాను మరియు ఆయనలా అచ్చుపోయబడుతాను. ఆయన నామమున నేను ప్రార్థిస్తాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు