ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మిమ్మల్ని మీరు "దేవుని నీతి" గా చివరిసారి ఎప్పుడు భావించారు అయినా అది మీకు ఎలా వర్తిస్తుంది ? మనము ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉన్నామని, ఉత్తమమైన జీవులుగా కనబడుతున్నామని దీని అర్థం! కానీ మనం దేవుడిలాంటివాళ్ళము కామని మనకు తెలుసు! మన తప్పులు మరియు లోపాలు మనకు తెలుసు! మన లోపాలు మరియు మన అసమానతలు మనకు తెలుసు! మనం "దేవుని నీతి" ఎలా అవుతాము? దేవుని పరిపూర్ణమైన మరియు పాపము చేయని నీతిమంతుడైన యేసు మన కొరకు మన పాపంగా మారా డు , కనుక మనం ఆయన నీతిగా ఉంటాము. అది దయ కంటే కూడా ఒక అద్భుతం! మరియు ఒక అద్భుతం కంటే కూడా వింత ఏమంటే ప్రియమైన మిత్రమా, యేసు ఖచ్చితంగా మీవంటివాడే !!

నా ప్రార్థన

దయగల మరియు ప్రేమగల తండ్రీ, నన్ను రక్షించి, మీ కుమారుని మీ త్యాగం ద్వారా నన్ను పరిపూర్ణంగా చేసినందుకు ధన్యవాదాలు. మీ దయను అంగీకరించని నా చుట్టూ ఉన్న వారితో మీ దయ మరియు మీ రక్షణను తెలియజేయడానికి దయచేసి నన్ను ఉపయోగించండి. నా అన్నయ్య మరియు రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు