ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ జీవితం వెనుక ఉన్న శక్తి ఏమిటి? తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన మార్గం ఏమిటంటే, యేసు వద్దకు వచ్చి, మిమ్మల్ని మీరు శోధించుకొని, ఆధ్యాత్మికంగా అనారోగ్యకరమైన, అపవిత్రమైనది ఏదైనా మీలో ఉన్నదేమో అని వెల్లడించమని ఆయనను కోరడము. మనము అతని పరిశీలన యొక్క వెలుగు వరకు, అతని కాంతి యొక్క సత్యము వరకు మనలను మనము కనపరుచుకొనగలిగితే అది మనకు గొప్ప స్వేచ్ఛా భావాన్ని ఇస్తుంది. మనకు దాచడానికి ఏమీ లేదు. అప్పుడు దేవుడు మనలో మరియు మన ద్వారా నిజంగా కొన్ని గొప్ప పనులను చేయగలడు ఎందుకంటే వక్రీకృత ఉద్దేశ్యాలు లేవు.

నా ప్రార్థన

ప్రపంచానికి వెలుగునిచ్చే మీ కుమారుని ద్వారా మీ కాంతిని నా హృదయంలోకి ప్రకాశించినందుకు దేవునికి ధన్యవాదాలు. దయచేసి నా బలహీనత, నా పాపం, నా వేషధారణ , మరియు నా మోసం వంటి ప్రాంతాలను నాకు సున్నితంగా వెల్లడించండి. నేను మీ ముందు మరియు పూర్తిగా మీ కోసం జీవించాలనుకుంటున్నాను. నేను యేసు నామము లో వినయంగా దీనిని అభ్యర్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు