ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు కొన్నిసార్లు దూరముగా ఉన్నాడు మరియు మన మాట వినడం లేదు అన్నట్లుగా ఉంటుంది. ఇజ్రాయేలీయులు దేవునిచే వాగ్దానం చేయబడిన విమోచకుడి కోసం వందల సంవత్సరాల ప్రార్దించుటను గురించి ఆలోచించండి. "దేవుడు వినుటలేదా ?" అని వారు పదేపదే ఆశ్చర్యపడ్డారు . సరైన సమయంలో, దేవుడు తన కుమారుడిని పంపించి విమోచనను తెచ్చాడు. కృతజ్ఞతగా, పరిస్థితులు బాగాలేన్నప్పుడు కూడా ప్రతిదీ బాగున్నట్లు నటించమని దేవుడు మనలను కోరుకొనుటలేదు . విమోచన మరియు సహాయం కోసం కన్నీటితో నిండిన పదాలతో అయన కీర్తనల గ్రంథమును నింపాడు. ఈ పదాలు మీరు ఉన్న స్థితిలో మీకు చాలినవిగ ఉండవచ్చు. మీరు ఆ పరిస్థుతులలో ఉంటే, వేలాదిమంది చదివే "ఈనాటి వచనము " అనే ఈ కార్యక్రములో పాల్గొనేవారు ఈ రోజు మీ యొక్క తక్షణ మరియు శక్తివంతమైన విమోచన కోసం ప్రార్థిస్తున్నారని గ్రహించండి.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నీ నామము పరలోక దేవదూతల మధ్య ఉన్నట్లే భూమి అంతా గౌరవించబడును గాక. మా కాలములో మీ రాజ్యం యొక్క శక్తిని మరియు బలమును చూపించు. మీ సంఘము మరియు మీ పిల్లలను చెడు చేతుల నుండి విడిపించండి. ఆధ్యాత్మిక, కుటుంబం, ఆరోగ్యం లేదా ఆర్థిక సమస్యలతో మీ సహాయం కోసం ఏడుస్తున్న మీ పిల్లలకు విముక్తి కలిగించండి. మా జీవితాలు మీ కీర్తికి అనుగుణంగా ఉండనివ్వండి

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు