ఏప్రిల్ 2019 Archives

30. 04 2019 - ఫిలిప్పీయులకు 4:19

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

29. 04 2019 - కీర్తనలు 10:12

యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి యెత్తుము.

28. 04 2019 - యాకోబు 1:27

తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా ― దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

27. 04 2019 - యాకోబు 1:26

ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

26. 04 2019 - కీర్తనలు 10:14

నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రిలేని వారికి నీవే సహాయుడవై యున్నావు.

25. 04 2019 - అపోస్తులకార్యాలు 2:41

కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

24. 04 2019 - 1 తిమోతికి 6:6

సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.

23. 04 2019 - కీర్తనలు 146:1-2

యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.

22. 04 2019 - కీర్తనలు 46:1-2

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను

21. 04 2019 - గలతీయులకు 6:10

కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరి యెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారి యెడలను మేలు చేయుదము.

20. 04 2019 - కీర్తనలు 145:3-4

యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరమువారు మరియొక తరమువారి యెదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు.

19. 04 2019 - ఆమోసు 5:24

నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.

18. 04 2019 - కీర్తనలు 103:6

యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును.

17. 04 2019 - ఫిలిప్పీయులకు 4:4-5

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి.మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

16. 04 2019 - కీర్తనలు 145:1-2

రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.

15. 04 2019 - రోమా 13:7

ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించు చున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని యెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవని యెడల సన్మానముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.

14. 04 2019 - యాకోబు 4:14-15

రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

13. 04 2019 - కీర్తనలు 144:4

నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.

12. 04 2019 - ఆమోసు 5:15

కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.

11. 04 2019 - కొలొస్సయులకు 2:17

ఇవి రాబోవువాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.

10. 04 2019 - కొలొస్సయులకు 2:6

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,...........నడుచుకొనుడి.

9. 04 2019 - కీర్తనలు 50:1

దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

8. 04 2019 - కీర్తనలు 143:1

యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు చెవి యొగ్గుము. నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.

7. 04 2019 - ఆమోసు 5:14

మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.

6. 04 2019 - 1 పేతురు 2:11

ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

5. 04 2019 - కీర్తనలు 55:16-17

అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును.సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నాలకించును.

4. 04 2019 - యోహాను 20:19

ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి ― మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

3. 04 2019 - యోహాను 19:38-39

అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసుదేహమును తీసికొనిపోయెను మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

2. 04 2019 - యోహాను 18:2

యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండు వాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.

1. 04 2019 - 1 కొరింథీయులకు 1:25

దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానము కంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటె బలమైనది.