ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము అపొస్తలుల కార్యముల పుస్తకమును చదివినప్పుడు, శిష్యులు "ఆ నామము నిమిత్తము" శ్రమలను అనుభవించుటలో చాలా సంతోషించడాన్ని మనం చూస్తాము. యేసు ఇప్పటికే అలాంటి కష్టాలను విజయవంతంగా అధిగమించాడు కాబట్టి, కేవలం కష్టాల్లోనే కాకుండా ఆయన బాధల్లో పాలుపంచుకోవడం ఒక ఆధిక్యతగా మనం భావించాలి. మనం "అగ్నిలో" ఉన్నప్పుడు మన నిబద్ధతను గూర్చిన నిజం తరచుగా సందేహపడు వ్యక్తులకు ఉత్తమంగా చూపబడుతుంది. కాబట్టి దాడికి లేదా శ్రమకు గురైనప్పుడు మన స్వభావమును కాపాడుకుందాం మరియు సంతోషిద్దాం ఎందుకంటే దేవుని పిల్లలు తమ జీవితాలను పణంగా పెట్టి విశ్వాసంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో యేసులో మనం చూశాము.

నా ప్రార్థన

ప్రభువా, నీ కుమారునికి ఎంత విలువైన పేరు పెట్టావు. అతను నిజంగా ప్రభువు అని ప్రతి హృదయం తెలుసుకునే వరకు అది భూమి అంతటా మరియు సమస్త ఆకాశమంతటా ఉన్నతంగా ఉండుగాక . యేసు నామంలో, మరియు అతని మహిమ కోసం, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు