ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మొదటగా, సహాయం కోసం చేసే ఈ మొఱ్ఱ చాలా అత్యవసరమైనది . ఏదేమైనా, దగ్గరిగా పరిశీలించినచో ఇది నిజంగా నిరాశ యొక్క ఏడుపు అని తెలుస్తుంది. మీరు అటువంటి పరిస్థుతులలోకి వెళ్ళారా? నేను ఖచ్చితంగా వెళ్ళాను, మరియు ఇప్పుడు అటువంటి పరిస్థుతులలో ఉన్నవారి నుండి నేను క్రమం తప్పకుండా వారి బాధలు వింటున్నాను . ఈ కీర్తన ఎలా ముగుస్తుందో ఒక్కసారి చదవండి! సుదీర్ఘ వేదన నుండి బయటపడటానికి రహస్యం ఏమిటి? మూడు విషయాలు ముఖ్యమని నేను నమ్ముతున్నాను: 1) దేవునితో మన ప్రార్థన జీవితంలో నిజాయితీ, 2) మన ప్రార్థనలు నొప్పితో మరియు నిరాశతో మునిగిపోయినప్పుడు కూడా దేవుడు వింటాడు మరియు శ్రద్ధ వహిస్తాడు అనే విశ్వాసం, మరియు 3)ఇలాంటి విషయాలు కనిపించినప్పుడు కూడా మన ప్రార్థనలలో దేవునికి నిజమైన మహిమ ఉంటుంది. ఇది మాయ సూత్రం కాదు, కానీ అది ఆత్మ ప్రేరేపితమైనది - 4 వ కీర్తనలో చూడండి!

నా ప్రార్థన

దేవా, దయచేసి ఉపశమనం కోసం నేను చేసే ఆర్తనాదాలు వినండి, అలాగే నేను ప్రేమిస్తున్నవారికి, వేదన, భారాలు మరియు బాధల నుండి ఉపశమనం ఇవ్వండి. దయచేసి అద్భుతమైన మరియు అద్భుత మార్గాల్లో సమాధానం ఇవ్వండి, తద్వారా మేము ఉపశమనం పొందటమే కాదు కానీ మీరు కూడా మహిమపరచబడతారు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు