ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన స్వంత, స్వీయ మార్గాల నుండి దూరంగా వెళ్లిపోమని దేవుడు మనకు గుర్తుచేస్తున్నాడు. ఆయన తన చిత్తానికి విధేయత చూపు సిద్దమనస్సుతో తన వైపునకు తిరగమని పిలుస్తున్నాడు. మనం ఆయన పిలుపును నిరాకరిస్తే, మనం మరణానికి దారితీసే మార్గమున నడుస్తున్నామని తెలుసుకోవాలి.దేవుడు పునర్జన్మించడానికి, పునఃప్రతిష్ఠకు సంబంధించిన పనిని చేయాలనీ ఎంతో ఎదురు చూస్తున్నాడు , కానీ మనము మన వినాశనకరమైన మార్గాల నుండి తిరిగి వచ్చి, తన పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా జీవించడానికి మన హృదయాలను అర్పించమని ఆయన మనలను అడుగుచున్నాడు . మారుమనస్సు అనేది నాశనమునకు వెళ్ళు మార్గమును మూసివేసి తండ్రి ఇంటికిను, మరియు జీవము గల చోటుకును తీసుకోనువెళ్ళు మార్గమునకు నడిపించునది.

నా ప్రార్థన

నా జీవితాన్ని పరిపాలించడానికి, శాసించడానికి ప్రయత్నం చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి .నేను మీ మాటకు విధేయత చూపనప్పుడు, మీ సంకల్పం మీద తిరుగుబాటు చేసినప్పుడే నేను గందరగోళానికి గురి అయ్యానని నేను అంగీకరిస్తున్నాను.నా మనసుని, జీవితాన్ని పూర్తిగా మీ మీదకి తిప్పుకుంటున్నాను.నీ సంకల్పం పాటించడం, నీ మహిమ కొరకు బ్రతకడం నాకు కావాలి.మీ యొక్క క్షమాగుణం మరియు బలానికి కృతజ్ఞతలు .రక్షకుడు యేసు నామములో నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు