ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు దేవుని మెస్సీయ అని తెలుసుకోవడం ఒక విషయం. యేసును మన ప్రభువుగా అనుసరించడం మరొకటి. మన మనస్సులను, హృదయాలను మరియు జీవితాలను అన్నింటికీ ఒక క్రమములో ఉంచడము ఎల్లప్పుడూ ఒక సవాలు. యేసు శిష్యులు అతన్ని క్రీస్తు అని ఒప్పుకున్న తర్వాత, తన మహిమకైన నిజమైన మార్గాన్ని నేర్పించవలసి ఉందని ఆయనకు తెలుసు. మహిమ కిరీటానికి దారితీసే ముందు ఈ రహదారి ఆయన వేదనకు దారితీసిందని ప్రతి సువార్త మనకు గుర్తు చేస్తుంది. ప్రారంభ సంఘము దానిని ఒక పాటలో బంధించింది, అది వారు కూడా అదే రహదారిలో నడవాలని గుర్తుచేసింది (ఫిలిప్పీయులు 2: 5-11 చూడండి). మనము పరలోకానికి వెళ్ళే ప్రజలము కాని సాతాను మనల్ని పట్టాలు తప్పించి ఓడించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం రహదారి గుంతలు మరియు గడ్డలు మరియు ఎత్తైన కొండలను కూడా ఎదుర్కుంటామని మనం అనుకోవచ్చుగ్రహించాలి.అయితే మన రక్షకుడు ఈ రహదారిని ఇప్పటికే నడిచాడు, మరియు ఆ మార్గం మనము కూడా మహిమలో పాలుపంచుకోవడానికి దారి తీస్తుందని తెలుపుటకు ఆయనే మన గొప్ప గుర్తు .

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, యేసును నమ్మకంగా అనుసరించడానికి కష్టపడుతున్న అనేక మంది విశ్వాసులను నాకు తెలుసు. దయచేసి, ప్రియమైన యెహోవా, మీరు వారికి బలం మరియు ధైర్యాన్ని ఇవ్వమని నేను కోరుతున్నాను, మరియు వారిని ప్రోత్సహించడానికి మరియు వారి జీవితాలలో ఈ చీకటి సమయంలో వారికి సహాయం చేయడానికి మీరు నన్ను ఉపయోగించాలని నేను కోరుతున్నాను. నేను ప్రత్యేకంగా చాలా మంది వ్యక్తులను పేరు పెట్టి ప్రస్తావించాలనుకుంటున్నాను మరియు వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు