ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు మనకు ఇలా బోధించారు: "కాబట్టి మీరు ఇలా ప్రార్థించండి: 'పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. పరలోకమందు నెరవేరునట్లు భూమియందును నీ చిత్తము నెరవేరును గాక'" (మత్తయి 6:9-10). మనం ప్రార్థించేటప్పుడు, ప్రభువు సర్వభూమికి అందరిచేత గుర్తించబడే రాజుగా పాలించే ఆ రోజు కోసం మన హృదయాలు ఆశతో ఎదురుచూడాలి (ఫిలిప్పీయులకు 2:10-11). యేసు నేర్పిన ఆదర్శ ప్రార్థనలోని ప్రారంభ మాటలను మనం పలుకుతున్నప్పుడు, మనల్ని ఆయనకే అప్పగించుకుంటూ, ఆయన మన హృదయాలకు రాజుగా ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాము. మనకు, ఆయనే "ఏకైక ప్రభువు" మరియు మన హృదయాలను ఏలే "ఏకైక నామం" కలిగినవాడు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు; వీటిని పలికేటప్పుడు, కనిపించే మరియు కనిపించని సకల జీవరాశులు యేసును ప్రభువుగా గుర్తించే ఆ రోజు కోసం మనం ఎదురుచూస్తాము. దైవభక్తి లేని, దేవుని నామాన్ని దూషించే మరియు దేవుని గొప్పతనాన్ని తరచుగా విస్మరించే ఈ లోకంలో, పరలోకంలోనూ, భూమిమీదనూ, భూమి క్రిందనూ ఉన్న ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుందని, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువు అని ఒప్పుకుంటుందన్న వాగ్దానాన్ని మనం గట్టిగా నమ్ముతాము. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన సాటిలేనివాడు. భక్తి, ఘనత మరియు స్తుతికి అర్హమైన ఏకైక నామం ఆయనదే. మరియు నేడు మన జీవితాల్లో ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టాలని మనం నిర్ణయించుకుంటున్నాము!

నా ప్రార్థన

గొప్ప సర్వశక్తిమంతుడైన ప్రభువా, నాలో మాత్రమే కాదు, నీ ప్రజలలో మరియు మన చరిత్రలో నీకు మహిమకలుగునట్లుగా నీ మహిమ కొరకు పనిచేయండి . మీ నామము భూలోకంలో కీర్తించబడాలని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలు ఇతరులు మీ నామమున పిలవడానికి మరియు మీ కృపను స్తుతించడానికి సహాయ చేయడానికి మీ అధికారాన్ని మరియు సార్వభౌమాధికారాన్ని చూపించే ఘనమైన కార్యములను చేయండి. యేసు యొక్క పవిత్రమైన మరియు విలువైన నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు